సంక్రాంతి పండుగను పురస్కరించుకొని వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారు స్వగ్రామాలకు బయలుదేరారు. ఈ సందర్భంగా ఏలూరు జిల్లాలోని పెదపాడు మండలం కలపర్రు టోల్గేట్ వద్ద వాహనాల రాకతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అదేవిధంగా హైదరాబాద్ బెంగుళూరు తదితర ప్రాంతాల నుండి మన జిల్లాకు పండగ రాకతో ముందు నుంచే సందడి మొదలైంది.