వరదనీటిలో నడిపెల్లి అంగన్వాడి కేంద్రం

84చూసినవారు
దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం నడిపెల్లి అంగన్వాడి కేంద్రం మంగళవారం కురిసిన వర్షానికి వరదనీటిలో చిక్కుకుంది. ఎస్సీ కాలనీలోని ఈ అంగన్వాడి కేంద్రం లోపలికి పరిధిని చేరడంతో ప్రీస్కూల్ పిల్లల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. స్థానికులు ఈ సమస్యను దెందులూరు ఎమ్మెల్యే ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లారు. వర్షం పడినప్పుడల్లా వరద నీరు అంగన్వాడి కేంద్రంలోకి వస్తుందని స్థానికులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్