ఏలూరు జిల్లాలో 863 మంది ఓటు వేశారు

68చూసినవారు
ఏలూరు జిల్లాలో 863 మంది ఓటు వేశారు
ఏలూరు జిల్లాలో శనివారం మొత్తం 863 మంది వయస్సు పైబడిన వారు, దివ్యాంగులు ఇంటి నుంచి ఓటు వేశారని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. పోలవరం నియోజకవర్గంలో 90 మంది, ఉంగుటూరులో 213, ఏలూరులో 100, చింతలపూడిలో 118, దెందులూరులో 92, కైకలూరులో 151, నూజివీడులో 99 మంది హోం ఓటింగ్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్