ఏలూరు జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రచురించిన ఉద్యానవన పంటల పెంపకం 2024- 25 ఆర్థిక సంవత్సరంలో సన్న, చిన్నకారు రైతులకు ప్రభుత్వం అందించే రాయితీ, ఆర్థిక ప్రోత్సాహంపై ప్రచురించిన రైతుఫీల్డ్ బుక్‌ను కలెక్టర్ వెట్రిసెల్వి ఆవిష్కరించారు. బుధవారం ఏలూరు గౌతమీ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ ఉద్యాన పంటలకు ప్రభుత్వం అందించు ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.