వైకాపా అసమర్థ పాలనలో గ్రామాల్లో అభివృద్ధి జాడే లేకుండా పోయిందని కూటమి అభ్యర్థి కామినేని శ్రీనివాస్ ఆరోపించారు. ఉగాది సందర్భంగా మంగళవారం ఆలపాడు వినాయకుడి ఆలయంలో పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. కూటమి శ్రేణులతో కలిసి గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత ప్రభుత్వానికి మందుచూపు లేకపోవడంతోనే నీటి సమస్య తీవ్రమైందన్నారు.