ముదినేపల్లి: సర్పంచ్, వార్డ్ సభ్యులకు అవగాహన

74చూసినవారు
పంచాయతీ సర్పంచులు, ఉప సర్పంచ్ లు, వార్డ్ సభ్యులు వారి గ్రామాల అభివృద్ధికి చేపట్టాల్సిన విధులు, బాధ్యతలు తెలుసుకున్నప్పుడే గ్రామాలను అభివృద్ధి పథం వైపు నడపవచ్చని ఎంపిపి సత్యనారాయణ అన్నారు. సోమవారం ముదినేపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో గ్రామ పంచాయతీ విధులు, బాధ్యతలపై సర్పంచ్, వార్డ్ సభ్యులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పాలనా విధానంపై వీరికి సోమవారం నుంచి 4 రోజుల పాటు శిక్షణ ఇస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్