జిల్లా జాయింటు కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి గురువారం పాలకొల్లు మండలంలో సుడిగాలి పర్యటన నిర్వహించారు. శివదేవుని చిక్కాల, లంకలకోడేరు, బల్లిపాడు, పాలమూరు గ్రామాల్లో ధాన్యం భద్రపరచుకునే పద్ధతులను పరిశీలించారు. రైతులతో మాట్లాడి, ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో వర్షాలు పడే అవకాశం ఉందని, ధాన్యాన్ని తడవకుండా భద్రపరచాలని సూచించారు. భద్రపరిచేందుకు సహాయం కావాలంటే మండల అధికారులను సంప్రదించాలని చెప్పారు.