నూజివీడు మండలం పల్లెర్లమూడి గ్రామంలో నూజివీడు సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో పల్లెనిద్ర కార్యక్రమాన్ని శుక్రవారం రాత్రి నిర్వహించారు. సైబర్ నేరగాళ్లతో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని అనే విషయాలపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. బ్యాంకు లోన్లపై వచ్చే మెసేజ్ క్లిక్ చేయవద్దని, పెద్ద బహుమతి వస్తుందని ఆశ చూపించే మెసేజ్ ను పట్ల ఆకర్షితులు అయితే కలిగే అనర్థాలను వివరించారు.