నూజివీడు సిఐటియు ఆధ్వర్యంలో వేడుకలు

78చూసినవారు
నూజివీడు సిఐటియు ఆధ్వర్యంలో వేడుకలు
78 వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా నూజివీడు సిఐటియు కార్యాలయం లో జాతీయ పతాక ఆవిష్కరణ గురువారం జరిగింది. నూజివీడు సిఐటియు అధ్యక్షులు ఎన్ ఆర్ హనుమాన్లు జెండా ఆవిష్కరించారు. అర్థరాత్రి మహిళ ఒంటరిగా తిరగ గలిగిన నాడు మనకి స్వాతంత్ర్యం వచ్చినట్లని గాంధీ మహాత్ముడు అన్నారు. కానీ 77 సంవత్సరాల స్వాతంత్ర్యం లో కూడా మహిళలకు రక్షణ లేదని ఆరోపించారు. నాయకులు పద్మాంజలి, జి. రాజు, ఇతర కార్మికులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్