నూజివీడు నియోజకవర్గం పరిధిలో నూజివీడు రూరల్ సీఐ కొప్పిశెట్టి రామకృష్ణ గృహ నిర్మాణ, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి చేతుల మీదుగా విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు ప్రశంసా పత్రాన్ని గురువారం అందుకున్నారు. పల్లెర్లమూడి చిన్నారి బాలిక అత్యాచారం కేసు, ఆగిరిపల్లి మిస్సింగ్ కేసులు త్వరగా చేదించినందుకు ఈ అవార్డు అందించారు.