రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియేట్ విద్యార్ధుల మద్యాహ్న భోజన పధకం అమలుగా ఈఏడాది 27. 39 కోట్లు, వచ్చే విద్యాసంవ త్సరంలో రూ. 85. 84 కోట్లు ప్రభుత్వం ఖర్చుచేయనున్నదని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి వెల్లడించారు. శనివారం నూజివీడు ముడుపల్లి తాతయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పధకాన్ని రాష్ట్ర మంత్రి కొలుసు పార్ధసారధి ప్రారంభించారు.