కంకిపాడు మండలం పునాదిపాడులో పంట కాల్వను శుక్రవారం అధికారులు పరిశీలించారు. చైతన్య టెక్నో స్కూల్ నిర్వాకంతో పంట కాల్వలోకి వదులుతున్న మురుగు నీరు ప్రదేశాలను ఉయ్యురు ఆర్ డి ఓ రాజు, డీపీఓ నాయక్ లు శుక్రవారం సంయుక్తంగా పరిశీలించారు.
బ్రాంచి కాల్వ నుండి వెలువడుతున్న మురుగు నీరు దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నట్లు అధికారుల దృష్టికి స్థానికులు తీసుకెళ్ళారు.