ఉయ్యూరు పట్టణంలో 11వ వార్డు నందు శుక్రవారం రాత్రి గడపగడపకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ప్రజలతో మమేకమవుతూ పట్టణంలో ఉన్న ప్రతి సమస్యకు అతి త్వరలో పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కొల్లూరు ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.