ఎమ్మార్పీఎస్ 30వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా ఆదివారం జరిగాయి. ఏలూరు జిల్లా, టి నరసాపురం మండల ప్రధాన కేంద్రంలో ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు కేక్ కటింగ్ చేసి మిఠాయిలు పంచి, ర్యాలీ నిర్వహించి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ లంక జయ బాబు, రాయల పీరయ్య, గెద్దల శ్రీను, బొక్కా శ్రీను, నారపాము దుర్గారావు, యూత్, తదితరులు పాల్గొన్నారు.