తాడేపల్లిగూడెం డిపో కార్యాలయాన్ని మంగళవారం ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ బోర్డు జోనల్ చైర్మన్ అప్పల నాయుడు ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా బస్టాండ్ ఆవరణలో ఉన్న వివిధ స్టాళ్లను, సైకిల్ స్టాండ్లను ఆయన పరిశీలించారు. వ్యాపారస్తులందరూ కూడా ఎమ్మార్పీ రేటు ప్రకారమే ప్రయాణికుల దగ్గర వసూలు చేసేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే ప్రయాణికులకు అందిస్తున్న సేవలపై అడిగి తెలుసుకున్నారు.