అత్తిలి మండలం మంచిలి గ్రామంలో వైస్సార్సీపీ అధ్యక్షుడిగా ఉన్న వేండ్ర రాంపండు ఇటీవల వ్యక్తిగత కారణాలతో పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి గ్రామ వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు సమక్షంలో రాంపండుకు ఘనంగా సన్మానం నిర్వహించి, అయన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో సర్పంచ్, ఎంపీటీసీ లు, సొసైటీ అధ్యక్షులు, స్థానిక మహిళా నేతలు, నూతన అధ్యక్షుడు చిన్ను రెడ్డి, తేజ సోమిరెడ్డి పాల్గొన్నారు.