తేతలి 1లో ఫ్యామిలీ డాక్టర్ వైద్య శిబిరం

62చూసినవారు
తేతలి 1లో ఫ్యామిలీ డాక్టర్ వైద్య శిబిరం
తణుకు మండలం తేతలి-1లో బుధవారం 104 వాహనం ద్వారా ఫ్యామిలీ డాక్టర్ వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ సాయి భవాని ఆధ్వర్యంలో గ్రామంలో పర్యటించిన వైద్య బృందం మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలకు పరీక్షలు నిర్వహించి, మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీహెచ్ఐ ఉదయలక్ష్మి, డీఈఓ సాయిరాం, ఎంఎల్ హెచ్ పీ జ్యోతి రత్నశ్రీ, ఎంపీహెచ్ఎ రామ్ కుమార్, ఏఎన్ఎం చంద్రకళ, పైలట్ ఆనంద్, ఆశ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్