ఆకివీడు రాజకీయం.. రసవత్తరం

50చూసినవారు
ఆకివీడు రాజకీయం.. రసవత్తరం
ఆకివీడు నగర పంచాయతీ రాజకీయం ఆసక్తికరంగా మారింది. 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలపై సోమవారం నగర పంచాయతీ కార్యాలయంలో అత్యవసర కౌన్సిల్‌ సమావేశం జరిగింది. దీనికి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు హాజరయ్యారు. అయితే 13 మంది వైసీపీ కౌన్సిలర్లకు ముగ్గురు హాజరుకాలేదు. టీడీపీ, జనసేన కౌన్సిలర్లు హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. అంతకంటే మించి ఎమ్మెల్యే రఘురామ తమను పట్టించుకోలేదని ఇక్కడకు వచ్చిన టీడీపీ, జనసేన క్యాడర్‌ తిరిగి వెళ్లిపోవడం మరింత ఆసక్తికరంగా మారింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్