ఆకివీడు సామాజిక ఆరోగ్య కేంద్రం ప్రాంగణంలో రూ 1. 99 లక్షల వ్యయంతో నిర్మించిన 30 పడకల ఓపి విభాగాన్ని దాత డాక్టర్ దాట్ల సత్యనారాయణరాజు రూ. 65 లక్షల విరాళంతో ఏర్పాటు చేసిన 4 పడకల డయాలసిస్ కేంద్రాన్ని ఆరోగ్య సంక్షేమ, వైద్య విద్యాశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు పాల్గొన్నారు. అనంతరం దాతలను అభినందించారు.