జాతీయ కేంద్ర కార్మిక సంఘాల దేశ వ్యాపిత పిలుపులో భాగంగా సోమవారం ఉండిలో ఏఐటీయూసీ, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన, ధర్నా నిర్వహించారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసి యాజమాన్యాలకనుకూలంగా కార్మికులకు వ్యతిరేకంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ లు రద్దు చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు భీమారావు డిమాండ్ చేశారు.