ఉంగుటూరు మండల విద్యాశాఖ వారి ఆధ్వర్యంలో గురువారం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన గురుపూజోత్సవం కార్యక్రమంలో ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యేను విద్యాశాఖ అధికారులు ఘనంగా సత్కరించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ. విద్యార్థుల భవిష్యత్తు దిశా నిర్దేశం చేయడంలో ఉపాధ్యాయులు కీలకపాత్ర పోషిస్తారని అన్నారు.