జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా రామారావు

50చూసినవారు
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా రామారావు
ఉంగుటూరు మండలం నారాయణపురం వివేకానంద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు.. గొల్లపల్లి రామారావు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ మేరకు బుధవారం అధికారులు ఎంపిక ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం ఏలూరు జడ్పీ హాలులో జిల్లా కలెక్టర్, జిల్లా అధికారుల చేతుల మీదుగా ఆయన అవార్డు అందుకోనున్నారు. ఉపాధ్యాయ వృత్తిలో అనేక సంవత్సరాలుగా విశేష కృషి చేసిన రామారావును ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికైనందుకు గ్రామస్తులు విద్యార్థుల తల్లిదండ్రులు అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్