ఆసుపత్రిలో పెన్షన్ సొమ్ము పంపిణీ చేసిన విఆర్ఓ

70చూసినవారు
ఆసుపత్రిలో పెన్షన్  సొమ్ము పంపిణీ చేసిన విఆర్ఓ
ఉంగుటూరు మండలం కైకరానికి చెందిన కొట్టేటి రాఘవమ్మా అనారోగ్య కారణంగా ఏలూరు ఆశ్రం హాస్పిటల్ లో చికిత్స పొందుతోంది.ఈ క్రమంలో ఎన్టీఆర్ సామాజిక భరోసా పెన్షన్ డబ్బులు విఆర్వో నాగేశ్వరావు ఆస్పత్రి కి వెళ్ళి మంగళవారం అందజేశారు. ఉంగుటూరు మండలంలో దాదాపు నూరు శాతం పెన్షన్లు పంపిణీ పూర్తి చేశామని ఎంపీడీవో రాజ్ మనోజ్ పేర్కొన్నారు.లబ్ధిదారులకు సత్వరం ఆర్ధిక సాయం అందేందుకు ఆసుపత్రుల్లో ఉన్నా పెన్షన్ అందజేసేలా చర్యలు చేపట్టారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్