జిల్లా పరిధిలోని వివిధ ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. జి. సృజన ఆదేశించారు. గురువారం విజయవాడ కలెక్టరేట్లో జాతీయ రహదారులు, రైల్వేలకు సంబంధించి వివిధ ప్రాజెక్టుల భూ సేకరణ ప్రక్రియపై సమావేశం నిర్వహించారు. భూ సేకరణ విస్తీర్ణం, అవార్డు పాస్ వివరాలు, ప్రక్రియ ఏ దశలో ఉందనే వివరాల ఆరా తీశారు.