AP: కూటమి ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని వైసీపీ ఏపీ ఎన్జీవో అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. ప్రస్తుతం సీపీఎస్, జీపీఎస్, ఓపీఎస్ లలో ఏది ఉందో అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు. మెరుగైన పీఆర్సీ ఇస్తామని మోసం చేసి చంద్రబాబు ఉద్యోగులతో ఓట్లు వేయించుకున్నారని విమర్శించారు. కానీ ఇంతవరకు కనీసం పే రివిజన్ కమిషన్ ను ఏర్పాటు చేయలేదన్నారు.