AP: తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో మంత్రి కందుల దుర్గేశ్ పర్యటించారు. డంపింగ్ యార్డ్, టిడ్కో గృహాలు, వైఎస్సార్ కాలనీలో ఆయుష్మాన్ హెల్త్ సెంటర్ నూతన భవనాన్ని మంత్రి పరిశీలించారు. బీటలు వారిన భవనాన్ని చూసి మున్సిపల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బంది పనితీరుపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు.