ఐపీఎల్-2025కు ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ గాయపడ్డాడు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో అతడికి గాయమైంది. బ్యాటింగ్ చేస్తుండగా అతడి కుడి కాలి చీలమండకు గాయం కావడంతో మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యే ఛాన్స్ ఉంది. దీంతో కేకేఆర్ ఫ్యాన్స్‌లో ఆందోళన మొదలైంది. ఐపీఎల్ దగ్గర పడుతుండడంతో అప్పటికి కోలుకోవాలని ఆశిస్తున్నారు.