సుదీర్ఘ విరామం తర్వాత రంజీ ట్రోఫీ బరిలోకి దిగిన భారత స్టార్ ప్లేయర్లు నిరాశపరిచారు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఫామ్ అందుకోవడమే లక్ష్యంగా దేశవాళీ క్రికెట్‌లోకి అడుగుపెట్టినా.. తొలి రోజు ఆటలో నిరాశపరిచారు. రోహిత్ శర్మ, జైశ్వాల్, గిల్, పంత్‌లు ఏకంగా సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ చేరారు. శ్రేయస్ అయ్యర్ 11 పరుగులు చేసి.. వారినే అనుసరించాడు. దీంతో భారత స్టార్ ఆటగాళ్ల ప్రదర్శన పట్ల అభిమానులు నిరాశలో కూరుకుపోయారు.