ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య

70చూసినవారు
ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య
ఎన్టీఆర్ జిల్లా మైలవరం పట్టణంలో గల ఒక ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థిని శనివారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కళాశాలలో సంచలన కలిగించింది. ఈసీఈ రెండో సంవత్సరం విద్యాభ్యాసం చేస్తున్న రోషిని అనే విద్యార్థిని కళాశాల హాస్టల్ గదిలో ఫ్యానుకు ఉరివేసుకొని మరణించినట్లుగా చెప్పుకుంటున్నారు. యాజమాన్యం కళాశాలకు సెలవు ప్రకటించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలిపారు.

సంబంధిత పోస్ట్