భార్యను పాముతో కాటు వేయించి హత్యాయత్నానికి పాల్పడిన పోలీస్

68చూసినవారు
భార్యను పాముతో కాటు వేయించి హత్యాయత్నానికి పాల్పడిన పోలీస్
యూపీలోని లక్నోలో షాకింగ్ ఘటన జరిగింది. అనూజ్ పాల్ అనే పోలీస్ అధికారి తన భార్య అన్షికను హత్య చేయడానికి ప్లాన్ చేశాడు. పెళ్లయ్యాక అతడికి పోలీస్ ఉద్యోగం రావడంతో అన్షిక అడ్డును తొలగించుకునేందుకు ప్లాన్ చేశాడు. ఈ క్రమంలో పాములు పట్టే వాడితో మాట్లాడి.. ఆమెపై దాడి చేయించాడు. వెంటనే ఆమె ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకోవడంతో ప్రాణాలతో బయటపడింది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అసలు విషయం బయటపడింది.

సంబంధిత పోస్ట్