TG: కేవలం ప్రభుత్వ భవనాల నిర్మాణం విషయంలోనే ఇంజినీరింగ్ అధికారులు ఎప్పటికప్పుడు నిర్మాణశైలిని గమనిస్తున్నారు. ఇళ్లు, వాణిజ్య సముదాయాల పరంగా కనీస నిబంధనలను పాటించని నిర్మాణాలే అధికంగా ఉంటున్నాయి. అనుమతులు ఇచ్చింది.. మొదలు అది ఏ తరహాలో పూర్తి చేస్తున్నారనే కోణంలో అధికారులు పరిశీలించాలి. కేవలం సెట్ బ్యాక్ నిబంధన మాత్రమే చూస్తున్నారు. సెల్లార్ల నిర్మాణం, ఫిల్లర్ల పరిమాణం, అదనపు అంతస్తులను పట్టించుకోవడంలేదు.