యంగ్ హీరో ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ జపాన్‌లో విడుదైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జపాన్‌లో ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. దీనిపై తాజాగా స్పందిస్తూ..'నేనెప్పుడు సందర్శించినా జపాన్ నాకు మంచి జ్ఞాపకాలు అందిస్తుంటుంది. కానీ ఈ సారి భిన్నంగా అనిపించింది. ఆర్‌ఆర్ఆర్ మూవీ చూసి ఓ జపానీస్ అభిమాని తెలుగు నేర్చుకున్నారని చెప్పడం కదిలించింది' అని అన్నారు.