AP: హోంమంత్రి అనితపై అసభ్యకర పోస్టులు పెట్టిన వైసీపీ కార్యకర్తను మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసులకు పట్టించారు. నకరికల్లుకు చెందిన రాజశేఖర్ రెడ్డి గతంలో అనితపై అసభ్యకరమైన పోస్టులు పెట్టారు. దీనిపై నూజివీడులో కేసు నమోదైంది. పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. రాజశేఖర్ తమ ఆఫీసులోనే ఉన్నాడని, దమ్ముంటే అరెస్ట్ చేయాలని అంబటి రాంబాబు సవాల్ విసిరారు. దాంతో పోలీసులు నేరుగా అక్కడికి వెళ్లి రాజశేఖర్‌ను అరెస్ట్ చేశారు.