AP: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ రాబోయే 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా బలపడనుందని అంచనా వేస్తోంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. వీటి ప్రభావంతో బుధ, గురువారాల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది.