వైసీపీకి మాజీ మంత్రి బాలినేని రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. నేడు పవన్ కళ్యాణ్‌తో బాలినేని భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం వల్ల ఇబ్బంది వచ్చిందేమో. నేనే ఏ రోజు కూడా సొంత ప్రయోజనాల కోసం జగన్‌ను కలవలేదు. నాపై తప్పుడు ప్రచారం చేయించారు. నేను ఏ తప్పు చేశానని మంత్రి పదవి నుంచి తీసేశారు. వైఎస్‌ఆర్ నన్ను రాజకీయంగా చేరదీశారు. మంత్రి పదవి వదులుకొని జగన్ కోసం వైసీపీలోకి వచ్చాను' అని బాలినేని అన్నారు.