కీర్తి చక్ర పొందిన తొలి తెలుగు వ్యక్తి!

70చూసినవారు
కీర్తి చక్ర పొందిన తొలి తెలుగు వ్యక్తి!
శ్రీకాకుళం జిల్లాకు చెందిన మేజర్ మళ్ల రామ్‌గోపాల్ నాయుడికి కీర్తి చక్ర పురస్కారం వరించింది. నేడు రాష్ట్రపతి అవార్డు అందించనున్నారు. 2023 అక్టోబర్ 26న జమ్ముకశ్మీర్‌లోని కుప్వారాలో ఐదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన బృందానికి రామ్ నాయకుడిగా ఉన్నారు. టెర్రరిస్టులను ఏరివేయడంతో పాటు తన టీంను కాపాడటంతో కేంద్రం ఈ పురస్కారంతో గౌరవించింది. ఈ ఘనత తెలుగు సమాజానికే గర్వకారణం అని కేంద్రమంత్రి రామ్మోహన్ కొనియాడారు.

సంబంధిత పోస్ట్