విశాఖ సముద్రంలో ఫిషింగ్ బోటు దగ్ధం.. 40 లక్షల ఆస్తి నష్టం! (వీడియో)

63చూసినవారు
విశాఖ సముద్రంలో వేటకు వెళ్లిన ఫిషింగ్ బోటు ఇంజిన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇంజిన్‌లో ఏర్పడిన మంటలు పూర్తిగా బోటుకు వ్యాపించడంతో బోటు పూర్తిగా దగ్దమైంది. ఆ సమయంలో మరో ఫిషింగ్ బోటు దగ్గరలో ఉండటంతో కాలిపోయిన బోటులో వేటకు వెళ్లిన ఐదుగురు క్షేమంగా బయటపడగలిగారు. ఫిషింగ్ బోటు మంటల్లో దగ్ధమవడంతో సుమారు 40 లక్షలు వరకు ఆస్తి నష్టం ఏర్పడిందని సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్