భారత యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ తండ్రి అయ్యారు. ఆయన భార్య రొమానా జహూర్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఆయన తండ్రి, అప్పుడే పుట్టిన బిడ్డతో సర్ఫరాజ్ దిగిన ఫొటో వైరల్ అవుతోంది. ఇటీవల ఈయన న్యూజిలాండ్‌పై 150 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే.