ఏపీ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. రాజమహేంద్రవరం వద్ద గోదావరి నది మధ్యలో ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ రెస్టారెంట్‌ను మంత్రి దుర్గేశ్, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, బత్తుల బలరామకృష్ణలతో కలిసి ప్రారంభించారు. ఉమా మార్కండేయస్వామి ఆలయం లాంచీల రేవు వద్ద ఇసుక తిన్నెల్లో ఈ రెస్టారంట్‌ను పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.