ఏపీ గనుల శాఖ మాజీ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. నిన్న హైదరాబాద్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ విజయవాడ కోర్టులో హాజరుపర్చనున్నారు. గత ప్రభుత్వంలో గనుల శాఖలో టెండర్ల, ఒప్పందాలు, ఇసుక తవ్వకాల్లో అక్రమాలకు పాల్పడినట్లు అతనిపై అభియోగాలున్నాయి.