ప్రపంచాన్ని ఒక చోట చేర్చే సామర్థ్యం పర్యాటకానికి ఉంది. అంతర్జాతీయ సమాజంలో ఈ రంగం ప్రమేయం అనేక అంశాల్లో సానుకూల వృద్ధి పెంపొందిస్తుంది. దేశ ఆర్థిక వ్యవస్థ విషయానికొస్తే ఉపాధి కల్పనలో టూరిజం కీలక పాత్ర పోషిస్తుంది. దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచేందుకు ఇది ఉపయోగపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం గురించి అవగాహన పెంచడం దీని లక్ష్యం. పర్యాటకం ప్రాధాన్యత, సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక అభివృద్ధికి ఎలా దోహదపడుతుందో అవగాహన కల్పించడమే ఈ రోజు ముఖ్యేద్ధేశ్యం.