ప్రతి సంవత్సరం మిలియన్ల మంది పర్యాటకులు ప్రపంచవ్యాప్తంగా సరిహద్దులు దాటి ఆయా ప్రదేశాలను చూస్తారు. ఈ పర్యాటకులతో ప్రపంచ దేశాలలో ఉద్యోగాల కల్పన, పర్యాటకం వల్ల హోటళ్లు, రెస్టారెంట్లు, రవాణా, లోకల్ గైడ్స్ వంటి వివిధ రంగాల్లో ఉద్యోగాలు లభిస్తాయి. పర్యాటకులతో దేశాలలో ఆదాయం పెరిగే అవకాశం స్థానిక వ్యాపారాలకు, ప్రభుత్వ పన్ను ఆదాయానికి ఒక వనరుగా పర్యాటక రంగం ఉంటుంది. దీంతో పర్యాటకులకు, స్థానిక ప్రజలకు ఉపాధి ప్రయోజనం చేకూరుస్తుంది.