మాజీ మంత్రి పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

72చూసినవారు
మాజీ మంత్రి పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దగ్ధం అయిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన వెనుక మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ కోణంలోనే విచారణ జరుగుతోంది. దాంతో మాజీ మంత్రి పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై నిందలు వేస్తున్నారని ఆరోపించారు. ఆధారాలు లేకుండా అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఫైల్స్ దగ్ధం వెనుక తన పాత్ర ఉంటే నిరూపించాలని సవాల్ విసిరారు. ఈ కేసులో తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు.