ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఓ యువతిని పెళ్లి చేసుకునేందుకు పాకిస్తాన్‌లోకి ప్రవేశించిన భారత యువకుడిని అక్కడి పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై అక్కడి పోలీసులు ఆ అమ్మాయిని విచారించగా.. అతడు పరిచయం ఉన్న మాట వాస్తవమేనని తెలిపింది. కానీ.. అతడిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని ఆమె చెప్పింది. యూపీకి చందిన బాదల్ బాబు(30) పాకిస్తాన్ యువతిని పెళ్లి చేసుకోవాలని అక్రమంగా పాక్ సరిహద్దు దాటి అరెస్టు అయ్యాడు.