మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి వీరంగం సృష్టించారు. కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో వైసీపీ నాయకుడికి చెందిన అక్రమ కట్టడం కూల్చివేతను ఆయన అడ్డుకున్నారు. వైసీపీ నాయకుడు బళ్లా సూరిబాబు రాజ్యలక్ష్మీనగర్‌లో నగరపాలక సంస్థ అనుమతి లేకుండా భవనంపై మరో అంతస్తు నిర్మించారు. దానిని తొలగించాలని నగరపాలక సంస్థ నోటీసులు జారీ చేసింది. ఆయన స్పందించకపోవడంతో అధికారులు అదనపు అంతస్తు కూల్చివేతకు సిద్ధమయ్యారు. ఆ సమయంలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి తన అనుచరులతో వచ్చి వీరంగం సృష్టించారు.