గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో రెండు రోజుల క్రితం అల్లర్లకు కారణమైన కొందరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ యువకుడిని గల్లీలో తిప్పుతూ లాఠీలతో చితకబాదారు. అనవసరంగా అల్లర్లకు పాల్పడితే ఏం జరుగుతుందో తెలిసేలా పోలీసులు 'ట్రీట్‌మెంట్' ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే యువకుడిని పోలీసులు విచక్షణారహితంగా కొట్టడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.