దేశంలో చిన్నారులపై రోజు రోజుకి అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. మహారాష్ట్రలోని నవీ ముంబైలో దారుణ ఘటన జరిగింది. 15 ఏళ్ల బాలికపై స్కూల్ వ్యాన్ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. వ్యాన్ డ్రైవర్ బాలికను చించ్‌వాలి శివారాలోని ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. జరిగిన విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని శనివారం అరెస్ట్ చేశారు.