AP: మచిలీపట్నంలోని పేర్ని కుటుంబ గోదాములో రేషన్ బియ్యం మాయమైన కేసులో మరో నలుగురు పాత్రధారులను పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. రైస్ మిల్లర్ ఆంజనేయులును పెడనలోని నందిగామ రైస్‌మిల్లు వద్దకు తీసుకెళ్లి, రికార్డులు స్వాధీనం చేసుకున్నారట. లారీ డ్రైవర్ మంగారావు, ఆంజనేయులు బియ్యంను ఎవరికి అమ్మారో గుర్తించినట్లు తెలిసింది. రూ.27 లక్షల లావాదేవీలు జరిగినట్లు.. ఈ సొమ్ము ఎవరికి ఖాతాకు బదిలీ అయ్యిందని పోలీసులు ఆరా తీస్తున్నారు.