ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీ రెండో జాబితా విడుదల

61చూసినవారు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీ రెండో జాబితా విడుదల
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ శనివారం రెండో జాబితాను విడుదల చేసింది. మొత్తం 29 మంది పేర్లను ప్రకటించింది. పార్టీ ఢిల్లీ ఉపాధ్యక్షుడు కపిల్‌ మిశ్రాను కరావల్‌ నగర్‌ నుంచి బరిలోకి దిగనున్నారు. అదేవిధంగా మాజీ సీఎం మదన్‌లాల్‌ ఖురానా తనయుడు హరీశ్‌ ఖురానాకు మోతీ నగర్‌ టికెట్‌ ఇచ్చింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. తాజా జాబితాతో కలిపి బీజేపీ ఇప్పటివరకు 58 మంది అభ్యర్థుల పేర్లను వెల్లడించింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్