దేశరాజధాని ఢిల్లీలోని ఘజియాబాద్ లో ఖోడా హోటల్ లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి రోటీలను తయారుచేస్తూ.. ఆ రోటీలపై తన నోటి నుంచి ఉమ్మిని వేస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో యువకుడు ఉమ్ము వేయడం స్పష్టంగా కనిస్తోంది. అయితే, ఆ వీడియోను చూసిన నెటిజన్లు ఫుడ్ సేఫ్టీ అధికారులకు కంప్లైంట్ చేశారు. పోలీసులు అతనిపై కేసును నమోదు చేసినట్లు తెలుస్తోంది.